తెలంగాణ

telangana

వెండితెరపై పాతికేళ్ల 'ప్రేమికుడు'..!

By

Published : Sep 17, 2019, 5:39 PM IST

Updated : Sep 30, 2019, 11:18 PM IST

ఇండియన్​ మైకేల్​ జాక్సన్​ ప్రభుదేవా, నగ్మా ప్రధాన  పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ప్రేమికుడు'. ఈ సినిమా విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ప్రేమికుడు చిత్రానికి 25ఏళ్లు పూర్తి

లవ్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన 'ప్రేమికుడు' చిత్రం విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.1994 సెప్టెంబర్​ 17న తెలుగులో ప్రేమికుడుగా, తమిళంలో 'కాదలన్'​ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. రెండు చోట్ల మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

'ప్రేమికుడు' చిత్రానికి ఏ.ఆర్​.రెహమాన్​ అందించిన సంగీతం ఆల్​టైమ్​ ఫేవరెట్​గా నిలిచింది. ఇందులో 'ఊర్వశి.. ఊర్వశి..' 'ఎర్రాని కుర్రదాన్ని గోపాల..' 'అందమైన ప్రేమరాణి చేయి తగిలితే...' లాంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి.

ఈ సినిమా చేసే సమయానికి ప్రభుదేవాకు 21ఏళ్లు.. నగ్మాకు 19 ఏళ్లు మాత్రమే. అల్లు రామలింగయ్య, ఎస్​.పి.బాల సుబ్రహ్మణ్యం, రఘువరన్​, వడివేలు, మనోరమ కీలక పాత్రల్లో నటించారు. ఏ.ఆర్​.ఎస్​.ఫిల్మ్​ ఇంటర్నేషనల్​ పతాకంపై శంకర్​ దర్శకత్వం వహించాడు. 'ప్రేమదేశం' ఫేమ్​​ కే.టి.కుంజు మోహన్​ నిర్మాత.

ఇదీ చూడండి: పూరీ, ఛార్మి 'ఇస్మార్ట్' సక్సెస్​కు స్మార్ట్ కార్లు

Last Updated : Sep 30, 2019, 11:18 PM IST

ABOUT THE AUTHOR

...view details