తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హిందీ​లోనూ తారక్​-ప్రశాంత్​నీల్​ చిత్రం! - హిందీ వర్షన్​లో ఎన్టీఆర్​-ప్రశాంత్​ నీల్​ చిత్రం

'కేజీఎఫ్​' దర్శకుడు ప్రశాంత్​ నీల్​, జూ.ఎన్టీఆర్​ కాంబోలో చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమాను నేరుగా హిందీలోనూ చిత్రీకరించాలని దర్శకుడు నిర్ణయించినట్లు సమాచారం. దీని కోసం ఏడాదిన్నర పాటు తారక్​ కాల్షీట్లను ప్రశాంత్​ నీల్​ అడిగినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Prashanth Neel's special request to NTR
హిందీ​లోనూ తెరకెక్కనున్న తారక్​-ప్రశాంత్​నీల్​ చిత్రం!

By

Published : Aug 15, 2020, 6:01 AM IST

Updated : Aug 15, 2020, 7:38 AM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్​ఆర్​'లో నటిస్తున్నారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్​. ఈ చిత్రం పూర్తవ్వగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో ప్రాజెక్టు మొదలుపెడతారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత 'కేజీఎఫ్​' చిత్రంతో సినీ అభిమానులను ఆకర్షించిన ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో.. తారక్​ నటించడానికి రంగం సిద్ధంచేసినట్లు సమాచారం.

సైంటిఫిక్​ యాక్షన్​గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం దాదాపు ఏడాదిన్నర పాటు తారక్​ కాల్షీట్లు కావాలని దర్శకుడు ప్రశాంత్​ నీల్ ఆశిస్తున్నారట. ఈ చిత్రాన్ని హిందీ వెర్షన్​లోనూ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ​ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాతో బిజీగా ఉన్న తారక్​.. త్రివిక్రమ్​, ప్రశాంత్​ నీల్​లతో ప్రాజెక్టులను ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.

Last Updated : Aug 15, 2020, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details