పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇందులో ఓ ప్రత్యేక గీతం ఉందని సమాచారం. దానికోసం నటి ప్రణీతా సుభాష్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది.
మరోసారి పవన్ సరసన ప్రణీత! - పవన్ కల్యాణ్ వార్తలు
పవన్ కల్యాణ్- క్రిష్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటి ప్రణీతా సుభాష్ నటించనుందని సమాచారం. ప్రత్యేక గీతంలో నర్తించేందుకు ఆమెను చిత్రబృందం సంప్రదించిందని తెలుస్తోంది.
పవన్ - క్రిష్ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో ప్రణీత!
పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. పవన్ ప్రస్తుతం 'వకీల్‌సాబ్' సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.