విలక్షణ నటుడు అంటే ప్రస్తుత తరంలో గుర్తొచ్చే పేరు ప్రకాశ్‌రాజ్. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నాడు. అప్పుడప్పుడు వివాదాల్లోనూ ఇరుక్కుంటూ ఉంటాడు. అయితే గతంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఓ సీనియర్ నటుడ్ని కాపాడట. ఆయన ఆర్థిక ఇబ్బందుల్ని తీర్చడంలో ప్రకాశ్‌రాజ్, తన వంతు సాయం చేశాడని నటుడు రాజా రవీంద్ర చెప్పాడు.
సూసైడ్ చేసుకోకుండా ఆ నటుడ్ని కాపాడిన ప్రకాశ్‌రాజ్! - ప్రకాష్ రాజ్ న్యూస్
ప్రకాశ్‌రాజ్ నటుడే కాకుండా మంచి మనసున్న వ్యక్తి అని అన్నాడు నటుడు రాజా రవీంద్ర. తనకు అతడికి మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వెల్లడించాడు.
సుసైడ్ చేసుకోకుండా ఆ నటుడ్ని కాపాడిన ప్రకాశ్‌రాజ్!
ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజా రవీంద్ర.. "ఓ సీనియర్ నటుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ప్రకాశ్‌రాజ్‌కు తెలిసింది. ఆయన్ని తన దగ్గరకు తీసుకురమ్మని నాకు చెప్పారు. ఆయన బాధలు విని చలించిపోయి, వెంటనే రూ.50 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన దగ్గరి నుంచి ఒక్క రూపాయి ఆశించలేదు" అని చెప్పాడు.
ఇదీ చూడండి.. మాళవిక అందాలు.. మత్తెక్కించే ఆ కళ్లు