ఇప్పటివరకు తండ్రి నిర్మాణసంస్థల్లో పనిచేసే వారసులను చూశాం. అయితే అందుకు భిన్నంగా బాలీవుడ్ హీరోయిన్ దీపికాపదుకొణె రూట్ మార్చారు. తన తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.
"1983 ఏడాది అంటే క్రీడాభిమానులకు చాలా స్పెషల్. భారత క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలుచుకొని ప్రపంచ చూపు మనవైపు తిప్పుకొనేలా చేసింది. నిజానికి దీని కన్నా ముందు ప్రపంచంలో భారత క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన ఇండియన్ క్రీడాకారుల్లో ఒకరు నాన్న ప్రకాశ్ పదుకొణె. 1981లో ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. అలా 83 కన్నా ముందే ప్రపంచంలోనే బ్మాడ్మింటన్ క్రీడను తన ఆటతో ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇదంతా నాన్నకు అంత తేలికగా సాధ్యపడలేదు. ఇప్పుడున్నంత అధునాతన వసతులు, సౌకర్యాలు అప్పటి క్రీడాకారులకు లేవు. మ్యారేజీ హాల్లో శిక్షణ తీసుకున్నారు. అప్పట్లో బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులో లేవు. దీంతో మ్యారేజీ హాళ్లను ఆయన బ్యాడ్మింటన్ కోర్టులుగా మార్చారు. అనుకూలంగా లేనీ అంశాన్ని.. ఆయన తనకు అనుకూలంగా మార్చుకుని ఒక్కోమెట్టూ ఎదిగారు. ఇప్పుడున్న సదుపాయాలే కనుక ఆనాడే ఉన్నట్లైతే.. మరింత రాణించేవారు"