హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కు(pragya jaiswal all movies list) మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని, గత 10 రోజుల్లో తనను కలిసిన వారందరూ కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
'అఖండ' హీరోయిన్‌కు మరోసారి కరోనా - ప్రగ్యా జైస్వాల్
బాలయ్య 'అఖండ'తో త్వరలో ప్రేక్షకుల్ని అలరించనున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కు(pragya jaiswal height) కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆమె వెల్లడించింది.
గత కొన్నాళ్లుగా టాలీవుడ్లో కనిపించని ప్రగ్యా(pragya jaiswal movies).. నందమూరి బాలకృష్ణతో కలిసి 'అఖండ'లో(balakrishna latest movie) సందడి చేయనుంది. ఇటీవల షూటింగ్ పూర్తి కాగా, త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు.
'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ప్రగ్యా.. ఆ తర్వాత 'కంచె'తో(kanche movie heroine) గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం నక్షత్రం, జయ జానకి నాయక, ఓం నమో వెంకటేశాయ, ఆచారి అమెరికా యాత్ర చిత్రాల్లో నటించి మెప్పించింది.