తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్యాన్స్​తో కేక పుట్టిస్తోన్న సీనియర్​ నటి ప్రగతి

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి లాక్​డౌన్​లో తన వీడియోలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. డ్యాన్స్, యోగాకు సంబంధించిన వీడియోలు పెడుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

By

Published : Jul 22, 2020, 6:48 PM IST

డ్యాన్స్​తో కేక పుట్టిస్తోన్న సీనియర్​ నటి ప్రగతి
డ్యాన్స్​తో కేక పుట్టిస్తోన్న సీనియర్​ నటి ప్రగతి

'ఎఫ్‌2' సినిమాలో తమన్నా, మెహ్రీన్​కు‌ తల్లిగా నటించింది సీనియర్ నటి ప్రగతి. 'ఓ బేబీ' చిత్రంలో లక్ష్మీ కోడలిగా, రావు రమేష్‌ భార్యగా కనిపించి అలరించింది. తెలుగు సినిమాల్లో అక్క, అమ్మ, ఆడపడచులాంటి పాత్రల్లో నటిస్తూ పేరుతెచ్చుకుంది. లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రగతి తన కుమారుడితో కలిసి చేసిన కొన్ని నృత్యాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసింది.

తాజాగా తను డ్యాన్స్ చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్రగతి. ఆ వీడియోకు తనదైన శైలిలో కామెంట్‌ కూడా పెట్టింది. "చిన్ అప్ ... మీరు కష్టపడటం లేదు, మీరు జయించే మధ్యలో ఉన్నారు" అంటూ రాసుకొచ్చింది.

ABOUT THE AUTHOR

...view details