డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్'. సంక్రాంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు యశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రభాస్-యశ్ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
'సలార్' షురూ.. ముఖ్య అతిథిగా రాకీభాయ్ - సలార్ పూజా కార్యక్రమం
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం 'సలార్'.. పూజా కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కన్నడ సూపర్‌స్టార్ యశ్ విచ్చేశారు.
'సలార్' షురూ.. ముఖ్య అతిథిగా రాకీభాయ్
పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనున్న 'సలార్'లో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో పనిచేయనున్న ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రీకరణలో బిజీగా పాల్గొంటున్నారు. అలాగే ప్రశాంత్ నీల్.. 'కేజీఎఫ్-2' నిర్మాణాంతర పనులు చూసుకుంటున్నారు.
ఇదీ చూడండి:'16 పేజీల డైలాగ్.. సింగిల్ టేక్‌లో చెప్పేసింది'
Last Updated : Jan 15, 2021, 12:54 PM IST