తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సాహో'ట్రైలర్: అండర్ కవర్ ఆఫీసర్​గా ప్రభాస్ - యూవీ క్రియేషన్స్

బాహుబలి ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' ట్రైలర్​ విడుదలైంది. భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది. ఆగస్టు 30 థియేటర్లలోకి రానుంది ఈ సినిమా.

'సాహో'ట్రైలర్: అండర్ కవర్ ఆఫీసర్​గా ప్రభాస్

By

Published : Aug 10, 2019, 5:15 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'సాహో' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు. భారీ తారాగణంతో అత్యుత్తమ స్థాయి పోరాట సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఇది సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది.

ముంబయిలో జరిగిన రూ.2000 కోట్ల దొంగతనాన్ని ఛేదించేందుకు వచ్చిన అండర్ కవర్ పోలీసుగా ప్రభాస్ నటించాడు. ఆ క్రమంలో విలన్లను ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పోరాటంలో హీరోయిన్​ శ్రద్ధా కపూర్ చనిపోవడం... ఆ తర్వాత ప్రభాస్​ ఏం చేశాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

చుంకీ పాండే, మహేశ్​ మంజ్రేకర్, జాకీష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్, నీల్ నీతేశ్​ తదితర ప్రముఖ నటులు ఇందులో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ దాదాపు రూ.350 కోట్లతో ఈ సినిమా నిర్మించింది. సుజీత్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 30న ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు వస్తోంది.

ఇది చదవండి: 'సాహో' కోసం ప్రభాస్​కు 100 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details