రెబల్‌స్టార్ ప్రభాస్ హీరో ఓంరౌత్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'ఆదిపురుష్'. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. కొద్ది నెలలుగా ఆ పాత్రలకు తగ్గట్లు శరీరాకృతిని మార్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ.. పాత్రలకు తగ్గట్లు బాడీ కోసం డార్లింగ్, తాను ఎలాంటి డైట్ పాటిస్తున్నారో తెలిపాడు.
"కండలు తిరిగిన దేహాన్ని తయారుచేసేందుకు ఎలాంటి స్టెరాయిడ్స్ వాడటం లేదు. తినే పదార్థాలలో 50 శాతం కార్బోహైడ్రేట్స్, 50 శాతం ప్రొటీన్స్ ఉండేలా కచ్చితమైన డైట్ పాటిస్తున్నాం. కండరాలు బలంగా అవ్వడానికి వే ప్రొటీన్ తీసుకుంటున్నాం" అని వివరించాడు.