కథానాయకుడు ప్రభాస్.. తాను అనుకున్నంత సిగ్గరి కాదని నటి పూజా హెగ్డే చెప్పింది. వీరిద్దరూ కలిసి 'రాధేశ్యామ్'లో నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో కీలక షెడ్యూల్ ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన నేపథ్యంలో డార్లింగ్‌తో తనకు ఎదురైన అనుభవాల్ని పూజా వెల్లడించింది.
"ప్రభాస్.. నేను అనకున్నంత సిగ్గరి అయితే కాదు. అవతలి వ్యక్తి ప్రవర్తన, మాట్లాడే విధానాన్ని బట్టి అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు. ఒక్కసారి ఎవరితోనైనా కలిసిపోయారంటే చాలా సరదాగా ఉంటారు. సెట్స్‌లో మేమిద్దరం చాలా చక్కగా సమయాన్ని ఆస్వాదించాం"