తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అది అర్థమైతే బాగుపడినట్లే డార్లింగ్​​: ప్రభాస్​ - romantic movie heroine

'రొమాంటిక్'(Romantic movie release date) సినిమా హీరోహీరోయిన్​ ఆకాశ్​ పూరి, కేతికా శర్మను ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు రెబల్​స్టార్​ ప్రభాస్(romantic movie prabhas)​. వీరి సంభాషణ ఎంతో సరదా సరదాగా సాగింది. ఆ ముచ్చట్లేందో చూసేద్దాం..

prabhas
ప్రభాస్​

By

Published : Oct 27, 2021, 4:42 PM IST

Updated : Oct 27, 2021, 4:59 PM IST

నలుగురితో ఇట్టే కలిసిపోయే నటుల్లో ప్రభాస్‌ ఒకరు(romantic movie prabhas). సినిమాల్లోనే కాదు.. బయట కూడా అంతే ఉత్సాహంగా కనిపిస్తారు. డార్లింగ్‌ అని పిలిస్తే చాలు ముచ్చట్లలో మునిగిపోతారు. వారితో సరాదాగా గడిపేస్తారు. అవకాశం దొరకాలే గానీ తనదైన పంచ్‌లు విసురుతారు. ప్రభాస్‌ అభిమానులకు మరోసారి అలాంటి సరదా 'బాహుబలి'ని చూసే అవకాశం దక్కింది. ఆకాశ్‌ పూరి, కేతికా శర్మ నటించిన 'రొమాంటిక్‌' చిత్రం ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూ ఇందుకు వేదికైంది. ఈ నెల 29న(Romantic movie release date) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం 'రొమాంటిక్‌ డేట్‌ విత్‌ డార్లింగ్‌ ప్రభాస్‌' పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆకాశ్‌, కేతికతో ప్రభాస్‌ సరదాగా సంభాషించారు. "హాయ్‌ మేడమ్‌.. ఐయామ్‌ ప్రభాస్‌. ఫ్రమ్‌ మొగల్తూరు" అంటూ ప్రభాస్‌ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయం చాలు ఇంటర్వ్యూ అంతా ఎంత ఫన్నీగా సాగిందో చెప్పడానికి. మరి ఆ ఇంటర్వ్యూ సంగతులేంటో ఓ సారి చూసేయండి..

ప్రభాస్‌: హాయ్‌ ఆకాశ్‌! ఎలా ఉన్నావ్‌?

ఆకాశ్‌: బాగున్నా సర్‌.

ప్రభాస్‌: చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగాం. ఇద్దరిదీ ఒకే వయసు కదా! పెద్దవాళ్లం అయిపోయాం. నువ్వు 'రొమాంటిక్‌' సినిమా కూడా చేసేశావ్‌. అంతా ఓకేనా?

ఆకాశ్‌: అంతా ఒకే సర్‌. ఎవరినీ ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు.

ప్రభాస్‌: మరిచిపోయా. ఆకాశ్‌.. ఆ అమ్మాయి పేరేంటి?

ఆకాశ్‌: కేతిక సర్‌.

కేతిక: హాయ్‌ సర్‌. ఐయామ్‌ కేతిక ఫ్రమ్‌ న్యూ దిల్లీ.

ప్రభాస్‌:హాయ్‌ మేడమ్‌. ఐయామ్ ప్రభాస్‌ ఫ్రమ్‌ మొగల్తూరు (నవ్వులు).

కేతిక: సర్‌.. మీరు యూనివర్సల్‌ స్టార్‌. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. 'బాహుబలి' చిత్రంలోని మీ నటన నాకెంతో ఇష్టం.

ప్రభాస్‌: మేడమ్‌ ఎప్పుడూ ఇలానే వసపిట్టలా మాట్లాడుతుంటుందా?

ఆకాశ్‌: అవును సర్‌. చిన్నప్పటి నుంచీ అంతే. తనకి కొంచెం పిచ్చి ఉంది.

కేతిక: హేయ్‌.. నాకేం పిచ్చి లేదు. నాకు తెలుగు కొంచెం తెలుసు.

ప్రభాస్‌: ఈ చిత్రంలో మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయా?

ఆకాశ్‌: ఉన్నాయి సర్‌. ఇదొక మసాలా ఫిల్మ్‌. మంచి ప్రేమ కథను పరిచయం చేస్తున్నాం. యువతకు బాగా నచ్చుతుంది.

ప్రభాస్‌: డార్లింగ్‌.. 'రొమాంటిక్‌' షూటింగ్‌ ఎక్కడ జరిగింది?

ఆకాశ్‌: దాదాపు చిత్రీకరణ మొత్తం గోవాలోనే జరిగింది డార్లింగ్‌.

ప్రభాస్‌: కేతిక డార్లింగ్‌ నీకు ఇష్టమైన వంటకం?

కేతిక: మాంసాహారం సర్‌. చికెన్‌, మటన్‌, ఫిష్‌.. ఇలా అన్నీ ఇష్టమే.

ప్రభాస్‌: మీ దర్శకుడి గురించి చెప్పండి?

ఆకాశ్‌: నాన్న స్నేహితుడు అనిల్‌ పాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకు ముందు వీఎఫ్‌ఎక్స్‌ విభాగంలో పనిచేశారు. ఈ సినిమాతో మెగాఫోన్‌ పట్టారు. మీరు సినిమా చూస్తే ఆయనది తొలి పరిచయం అనుకోరు.

కేతిక: ఆయన చాలా కూల్‌గా, క్లారిటీతో ఉంటారు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది.

ప్రభాస్‌: రమ్యకృష్ణగారితో పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

ఆకాశ్‌: ఆమె నుంచి చాలా నేర్చుకున్నా డార్లింగ్‌. మన మూడ్‌ ఎలా ఉన్నా.. దర్శకుడు 'యాక్షన్‌' చెప్పగానే నటనలో ఇన్వాల్వ్ అయిపోవాలని తెలుసుకున్నా. నటుల జీవితం యాక్షన్‌, కట్‌ల మధ్య ఉందని అర్థమైంది.

ప్రభాస్‌:అది అర్థమైతే నువ్వు బాగుపడినట్లే బంగారం!

ప్రభాస్‌: కేతిక డార్లింగ్‌.. నటి కావాలని ఎప్పటి నుంచి అనుకున్నావ్‌?

కేతిక: చిన్నప్పటి నుంచీ నాకు సినిమా, సంగీతం, నృత్యం అంటే చాలా చాలా ఇష్టం. పాఠశాల రోజుల్లోనే నటిగా మారాలనుకున్నా.

ఇదీ చూడండి: సెట్ నుంచి పారిపోదాం అనుకున్నా: ఆకాశ్

Last Updated : Oct 27, 2021, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details