తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాలీవుడ్​కు ప్రభాస్​.. వార్తల్లో నిజమెంత? - మిషన్ ఇంపాజిబుల్ ప్రబాస్

యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్ హాలీవుడ్​లో నటించనున్నాడంటూ వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. 'మిషన్ ఇంపాజిబుల్'​లో డార్లింగ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. తాజాగా ఈ విషయమై స్పందించాడు దర్శకుడు మెక్​క్వారీ.

Prabhas
ప్రభాస్​

By

Published : May 26, 2021, 2:21 PM IST

యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్​ 'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో 'ఆదిపురుష్', 'సలార్', నాగ్ అశ్విన్​తో ఓ భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. వీటి షూటింగ్​లతో చాలా బిజీగా ఉన్నాడు డార్లింగ్. అయితే ఇప్పుడు ఇతడికి సంబంధించిన మరో వార్త నెట్టింట తెగ హల్​చల్ చేస్తోంది. త్వరలోనే డార్లింగ్ హాలీవుడ్​లో అడుగుపెట్టబోతున్నాడన్నది ఈ వార్త సారాంశం.

హాలీవుడ్​ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'​ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా టామ్ క్రూజ్​ చేసే స్టంట్స్​కు ప్రేక్షకులు ఈలలు కొట్టాల్సిందే. ఇప్పుడు ఈ సిరీస్​లో 7వ చిత్రమైన 'మిషన్ ఇంపాజిబుల్ 7' తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటలీలో 'రాధేశ్యామ్' చిత్రీకరణ సమయంలో దర్శకుడు క్రిస్టోఫర్ మెక్​క్వారీ ప్రభాస్​ను కలిసి కథ వివరించాడట. అది డార్లింగ్​కు నచ్చడం వల్ల ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని ఫైట్ సన్నివేశాల్ని కూడా పూర్తి చేశాడని నెట్టింట చెప్పుకొంటున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించాడు మెక్​క్వారీ.

ప్రభాస్​ను కలవలేదు

ఈ వార్త నెట్టింట వైరల్​గా మారడం వల్ల దీనిపై స్పందించాడు మెక్​క్వారీ. తాను ప్రభాస్​ను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశాడు. సోషల్ మీడియా ద్వారా ఇదంతా జరిగిందని వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details