తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​ 'రాధేశ్యామ్'‌లో హాలీవుడ్‌ యాక్షన్​ - radhye syam hollywood

హీరో ప్రభాస్ నటించనున్న 'రాధేశ్యామ్' సినిమాలోని ఓ భారీ సన్నివేశం కోసం హాలీవుడ్​ స్టంట్​ మాస్టర్​ నిక్​ పావెల్​ను రంగంలోకి ​దించనున్నారు. దాదాపు రూ.2కోట్ల వ్యయంతో ఈ సీన్​ను తెరకెక్కించనున్నారు.

Radhey syam
రాధేశ్యామ్

By

Published : Nov 8, 2020, 7:59 AM IST

ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రాధేశ్యామ్‌. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయిక. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ఓ చక్కటి ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఇటలీలో మరో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసి, ప్రభాస్‌తో పాటు చిత్రబృందం భారత్‌ చేరుకున్నారు.

ఇప్పుడు ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర బృందం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ నిక్‌ పావెల్‌ను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. గ్లాడియేటర్‌, ది లాస్ట్‌ సమురాయ్‌, ది బోర్న్‌ ఐడెంటిటీ వంటి గొప్ప హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన స్టంట్‌ మాస్టర్‌ ఆయన. ఇప్పుడాయన ఆధ్వర్యంలోనే ఓ అదిరిపోయే యాక్షన్‌ ఎపిసోడ్‌ను సిద్ధం చేశారట. దాదాపు రూ.2కోట్ల వ్యయంతో రూపొందించబోయే ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనుంది.

ABOUT THE AUTHOR

...view details