తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డార్లింగ్​ ప్రభాస్​ కొన్న ఆ టికెట్ ఏంటి..? - నిను వీడని నీడను నేనే

శుక్రవారం విడుదల కానున్న 'నిను వీడని నీడను నేనే' సినిమా తొలి టికెట్ హీరో ప్రభాస్ కొన్నాడు. ఆ ఫొటోను హీరో సందీప్ కిషన్ ట్విట్టర్​లో పంచుకున్నాడు.

ప్రభాస్ కొన్న ఆ టికెట్ ఏంటి..?

By

Published : Jul 11, 2019, 11:06 PM IST

నిను వీడని నీడను నేనే తొలి టికెట్ కొన్న హీరో ప్రభాస్

సినిమాల ప్రచార ధోరణి ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. ఆడియో ఫంక్షన్స్ తగ్గించి ప్రీరిలీజ్​ ఈవెంట్​లు చేస్తున్నారు. కాలేజ్​లకు వెళుతున్నారు. రకారకాలు పేర్లతో విభిన్న పద్ధతుల్లో పబ్లిసిటీ చేస్తున్నారు.

వీటిన్నింటికి భిన్నంగా 'నిను వీడని నీడను నేనే' చిత్రబృందం ప్రచారం చేస్తోంది. ఇటీవలే అభిమానుల్ని సెట్​కు ఆహ్వానించింది. కొన్ని రోజుల కిందట థియేటర్లలో టాయిలెట్ల దగ్గర పోస్టర్​లతో ప్రచారం చేసింది. ఇప్పుడు ఈ చిత్రం మొదటి టికెట్​ హీరో ప్రభాస్ కొన్నాడు. ఆ ఫొటోను హీరో సందీప్ కిషన్ ట్విట్టర్​లో పంచుకున్నాడు.

నిను వీడని నీడను నేనే సినిమా తొలి టికెట్ కొన్న హీరో ప్రభాస్

సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది. అన్య సింగ్ హీరోయిన్. వెన్నెల కిశోర్ కీలక పాత్రధారి. తమన్ సంగీతమందించాడు. కార్తిక్ రాజు దర్శకత్వం వహించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'డియర్​' కోసం తపన... కామ్రేడ్​ ట్రైలర్​

ABOUT THE AUTHOR

...view details