తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్​ బోల్డ్​ బ్యూటీకి ఊరట

Poonam Pandey Pornography Case: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్​ నటి పూనమ్​ పాండేకు ఊరట లభించింది. ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది.

Pornography case  Poonam Pandey
Pornography case Poonam Pandey

By

Published : Jan 18, 2022, 2:05 PM IST

Poonam Pandey Pornography Case: బాలీవుడ్​ను కుదిపేసిన పోర్నోగ్రఫీ కేసులో నటి పూనమ్​ పాండేకు కాస్త ఊరట లభించింది. పోర్న్​ ఫిల్మ్స్​ రాకెట్​ కేసులో.. ఆమెకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది సుప్రీం కోర్టు. జస్టిస్​ వినీత్​ శరణ్​, జస్టిస్​ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్​కు నోటీసులు జారీ చేయాలని, ఆలోపు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది.

పాండే ఇదివరకే ముందస్తు బెయిల్​ కోసం అప్పీల్​ చేసుకోగా.. బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే నటి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

పోర్నోగ్రఫీ కేసులో నటి షెర్లిన్​ చోప్రాతో పాటు పూనమ్​ పాండేపైనా ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. 2021 నవంబర్​ 25న ఆమె చేసిన ముందస్తు బెయిల్ దరఖాస్తు​ తిరస్కరణకు గురైంది.

Raj Kundra Case: అశ్లీల చిత్రాల కేసులో నటుడు రాజ్​ కుంద్రాకు కూడా డిసెంబర్​లో అరెస్టు నుంచి రక్షణ కల్పించింది అపెక్స్​ కోర్టు. కుంద్రాపై వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.

అరెస్టుకు భయపడి కుంద్రా బెయిల్​ కోసం తొలుత సెషన్స్​ కోర్టుకు వెళ్లాడు. అక్కడ తిరస్కరించగా.. హైకోర్టును ఆశ్రయించాడు. తనను కావాలనే ఇరికించాలని అన్నాడు. అనంతరం సుప్రీంకోర్టులో అప్పీల్​ చేశాడు.

ఇవీ చూడండి: షెర్లిన్ చోప్రాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా

Raj Kundra Case: జైలు నుంచి విడుదలైన రాజ్ కుంద్రా

ABOUT THE AUTHOR

...view details