వరుస చిత్రాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారింది పూజా హెగ్డే. రామ్‌చరణ్ హీరోగా నటించిన రంగస్థలంలో 'జిల్ జిల్ జిగేల్ రాణి..' అంటూ సాగే ప్రత్యేక గీతంలో నర్తించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయింది. అంతలా పాపులర్ అయిన ఆ వేషధారణలో మరోసారి కనిపించనుందీ భామ.
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న 'వాల్మీకి'లో పూజా హెగ్డేతో ఇలాంటి గెటప్ వేయించాడు దర్శకుడు హరీశ్ శంకర్. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నాడు. ఇది ఓ సన్నివేశం కోసమా లేదా మంచి మాస్ మసాలా పాట గురించా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.