తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pooja Hegde Movies: దానికోసం నెల ముందు నుంచే.. - pooja hegde birthday news

సాధారణంగా ఎవరైనా.. పుట్టినరోజును చేసుకోవాలంటే ఒకరోజు ముందు నుంచి.. మహా అయితే.. వారం ముందు నుంచి ఎదురుచూస్తుంటారు. కానీ పూజాహెగ్డే(Pooja Hegde Movies) మాత్రం.. నెల ముందే నుంచే ఎదురుచూస్తానని అంటోంది.

Pooja Hegde
పూజాహెగ్డే

By

Published : Sep 25, 2021, 7:21 AM IST

ఏడాదిలో వచ్చే అన్ని పండగల కంటే తన పుట్టినరోజు తనకెంతో ప్రత్యేకమని అంటోంది నాయిక పూజా హెగ్డే(Pooja Hegde Movies). ఆ ఒక్క రోజు కోసం నెల రోజుల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమవుతానంటోంది ఈ బుట్టబొమ్మ.

.

"అక్టోబరు 13న నా పుట్టినరోజు. నిజానికి అది ఆ నెలలో వచ్చే ఒకరోజే అయినా.. నాకు నెల రోజుల పండగలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి థీమ్ బర్త్​డే పార్టీస్​ అంటే ఇష్టం. అందుకే బర్త్​డేకు నెల ముందు నుంచే నేను కౌంట్​డౌన్ మొదలు పెట్టుకుంటా. ఇక పుట్టినరోజు వచ్చిందంటే.. నా వరకు నాకది నేషనల్ హాలీడే అన్నట్లే. ఆ రోజంతా స్నేహితులతో పార్టీ చేసుకుంటా.. సరదాగా గడిపేస్తా" అని పూజా హెగ్డే చెప్పింది.

.

ప్రస్తుతం పూజాహెగ్డే(Pooja Hegde Movies List) మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తోంది. అంతేకాక పూజా చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్‌లో సల్మాన్‌ 'కబీ ఈద్‌ కబీ దివాలీ', రణ్‌వీర్‌తో 'సర్కస్‌' చిత్రాలు చేస్తుంది. కోలీవుడ్‌లో విజయ్‌ 'బీస్ట్‌'లో కథానాయికగా నటిస్తుంది.

.

ప్రభాస్‌-పూజా(Pooja Hegde Movies List) జంటగా నటించిన 'రాధేశ్యామ్‌'(Radhe Shyam Release Date) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి:Prabhas Pooja Hegde: పూజాహెగ్డే-ప్రభాస్​కు మాటల్లేవా?

ABOUT THE AUTHOR

...view details