'రాధే శ్యామ్'.. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి. ప్రభాస్ హీరో. సోమవారం పూజ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాలోని ఆమె లుక్‌ను విడుదల చేసింది. పూజ పాత్ర పేరు 'ప్రేరణ'గా ఈ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇందులో ఈ భామ ఎంతో అందంగా నవ్వుతూ హీరో ప్రభాస్‌తో ముచ్చటిస్తూ కనపడింది. ఈ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
'రాధేశ్యామ్' నుంచి పూజ లుక్.. ప్రభాస్‌ను కనుక్కోండి! - రాధే శ్యామ్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా 'రాధే శ్యామ్' చిత్రబృందం సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేసింది.
1920ల నాటి కథతో యూరప్ నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు విదేశాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇటీవలే మళ్లీ ఇటలీ వెళ్లిన చిత్రబృందం అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తోంది. ఇందులో జగపతిబాబు, సత్యరాజ్, భాగ్యశ్రీ, జయరాం, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఇదీ చూడండి హీరోయిన్ పూర్ణ 'బ్యాక్‌డోర్' ఎంట్రీ