డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్ పనుల్లో చిత్రబృందం బిజీగా ఉంది. వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న ఆ వీడియోను విడుదల చేయనున్నారు. ఇప్పుడు టీజర్ డబ్బింగ్‌ను పూర్తి చేసింది హీరోయిన్ పూజాహెగ్డే.
'రాధేశ్యామ్' టీజర్‌పై పూజాహెగ్డే అప్డేట్ - prabhas movies
'రాధేశ్యామ్' టీజర్ గురించి మాట్లాడిన హీరోయిన్ పూజాహెగ్డే.. దాని కోసం తాను డబ్బింగ్ ముగించానని తెలిపింది. ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
'రాధేశ్యామ్' టీజర్‌పై పూజాహెగ్డే అప్డేట్
1960ల నాటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో థియేటర్లలో చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి:2021 మాములుగా ఉండదు.. సినిమాలే సినిమాలు