తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పొన్నియన్​ సెల్వన్'లో యుద్ధ వీరుడిలా విక్రమ్​.. మెరిసిన ఐశ్వర్య, త్రిష​ - పొన్నియన్ సెల్వన్ చిత్రం విడుదల

Ponniyin Selvan Release Date: స్టార్​ డైరెక్టర్​ మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'పొన్నియన్​ సెల్వన్-1​'. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విక్రమ్​, ఐశ్వర్య రాయ్​ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవిల ఫస్ట్​లుక్​లను విడుదల చేసింది చిత్రబృందం.

PonniyinSelvan first look
పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ లుక్

By

Published : Mar 2, 2022, 6:50 PM IST

Updated : Mar 2, 2022, 7:12 PM IST

Ponniyin Selvan Release Date: మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌-1'. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలుగా చేసిన విక్రమ్​, ఐశ్వర్య రాయ్​ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవి ఫస్ట్​లుక్​లు విడుదలయ్యాయి. వీటితో పాటు చిత్రం మొదటి భాగం విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. 2022, సెప్టెంబర్ ​30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

.
.

Ponniyin Selvan First Look: బుధవారం విడుదల చేసిన ఒక్కో పోస్టర్​ను మతి పోయోలా తీర్చిదిద్దారు స్టార్ డైరెక్టర్ మణిరత్నం. 2019 డిసెంబర్‌లోనే థాయ్‌లాండ్​లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా చిత్రీకరణ‌ వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి నుంచి సినిమా చిత్రీకరణ తిరిగి శరవేగంగా జరుపుకొంటోంది.

.
.
.

మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయరామ్‌, శోభిత ధూళిపాళ్ల, శరత్‌ కుమార్, ప్రకాశ్​రాజ్‌, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కనిపించనున్నారు. ఏ.ఆర్.రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి:విజువల్ వండర్​గా.. 'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్

Last Updated : Mar 2, 2022, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details