బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ప్రశ్నించిన పోలీసులు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. గతంలో సుశాంత్ డేట్స్ ఖాళీ లేకపోవడం వల్లే, ఈ డైరెక్టర్ అతడితో చేయాలనుకున్న నాలుగు సినిమాలు ఆగిపోయావని వెల్లడించారు. దీంతో ఆ చిత్రాలు వేరేవారితో చేయాల్సి వచ్చిందని తెలిపారు.
జూన్ 14న బాంద్రాలోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు సుశాంత్. ఇది సుసైడ్ అని పోస్ట్ మార్టమ్లో తేలినప్పటికీ, వృత్తిపరమైన కక్షలు ఏమైనా ఉన్నాయేమోనని భావించిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సుశాంత్ మృతితో సంబంధముందనే ఆరోపణల నేపథ్యంలో దాదాపు 34 మందిని ప్రశ్నించారు. వీరిలో సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర నటీనటులు ఉన్నారు.