తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మే 24న 'పీఎం నరేంద్ర మోదీ' విడుదల - మే 24న

'పీఎం నరేంద్ర మోదీ' సినిమా విడుదలకు మరోసారి ముహూర్తాన్ని ఖరారు చేసింది చిత్రబృందం. లోక్​సభ ఎన్నికల ఫలితాల అనంతరమే చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది.

ఎన్నికల ఫలితాల తర్వాతే 'పీఎం నరేంద్ర మోదీ'

By

Published : May 3, 2019, 10:59 AM IST

Updated : May 3, 2019, 12:02 PM IST

మే 24న 'పీఎం నరేంద్ర మోదీ' విడుదల

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' చిత్రాన్ని మే 24న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

మొదట ఏప్రిల్​ 11నే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ.. సినిమా ఎన్నికలను ప్రభావితం చేయగలదన్న కారణంతో ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

తాజాగా విడుదల తేదీని ప్రకటించారు చిత్ర నిర్మాత సందీప్ సింగ్.

"చాలా చర్చలు, పెరిగిపోతున్న అంచనాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. మే 24న థియేటర్లలోకి రానుంది. 4 రోజులు మాత్రమే ఈ చిత్ర ప్రచారానికి అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు."
-సందీప్ సింగ్

వివేక్​ ఒబెరాయ్​ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఒమంగ్​ కుమార్​ దర్శకుడు. సురేశ్ ఒబెరాయ్​, ఆనంద్​ పండిట్ సహ నిర్మాతలు. బొమన్ ఇరానీ, మనోజ్​ జోషి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఇదీ చూడండి: ఆటోవాలాకు ఖరీదైన విల్లా వచ్చిందిలా...

Last Updated : May 3, 2019, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details