ప్రస్తుతం తాను డిప్రెషన్లో ఉన్నానని నటి పాయల్ రాజ్‌పుత్ చెప్పింది. కొవిడ్ కారణంగా ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోవడం, ఎంతో బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు పాయల్ ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయని, అందరూ ఇంటికే పరిమితమై తమ వారిని రక్షించుకోవాలని సూచించింది.
"ఇదే నా జీవితంలో అతి క్లిష్టమైన దశ. ఎంతో ఆందోళనగా ఉంది. మానసిక కుంగుబాటుకు లోనయ్యా. గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది. నాలోని బాధను చెప్పడానికి మాటలు కరవయ్యాయి. నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయా. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నా. దయచేసి అందరూ తమ కుటుంబసభ్యుల్ని సంరక్షించుకోవాలని సూచిస్తున్నా" అని పాయల్ పోస్ట్ పెట్టింది.