'ఆర్.ఎక్స్.100', 'ఆర్డీఎక్స్ లవ్' చిత్రాల్లో తన అందచందాలుఆరబోసి అభిమానుల హృదయాలు కొల్లగొట్టింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. అయితే ఇలాంటి బోల్డ్ పాత్రల గురించి ఇంట్లో చర్చిస్తారా? అని అడగ్గా ఆసక్తికరంగా సమాధానం చెప్పింది.
అమ్మే ఆ పాత్రలు చేయమంటోంది! - payal rajput new movie update
బోల్డ్ పాత్రలు చేసినా, తల్లిదండ్రులతో కలిసి ఆ సినిమా చూడటం అసౌకర్యంగానే ఉంటుందని పాయల్ చెబుతోంది. కొత్త కథలు విన్న తర్వాత ప్రతి అంశాన్ని అమ్మతో చర్చించి, సలహా తీసుకుంటానని తెలిపింది.
'నచ్చితే బోల్డ్ పాత్రలైనా చేయమంటోంది అమ్మ!'
"నేను కథ విన్న తర్వాత అందులోని విషయాలన్నీ మా అమ్మతో పంచుకుంటా. ఇన్ని ముద్దు సీన్లు ఉన్నాయి, ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని వివరిస్తా. నీ మనసుకు నచ్చి, నీకు సౌకర్యంగా అనిపిస్తే ఏదైనా చెయ్యి అని అమ్మ సలహా ఇస్తుంటుంది. బోల్డ్ పాత్రలు ఎంత ఇష్టపడి చేసినా అమ్మానాన్నలతో కలిసి చూడటం అసౌకర్యంగానే ఉంటుంది. వాళ్లకు నన్నలా చూడటం ఇబ్బందిగానే అనిపించొచ్చు కానీ, ఎప్పుడూ బయటకు చెప్పరు" అని చెబుతోంది పాయల్.