తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మెగాస్టార్ తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం' - చిరంజీవి

మెగాస్టార్​కు తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరమని... చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు పవర్​స్టార్​ పవన్​కల్యాణ్. ట్విట్టర్​ వేదికగా సందేశాన్ని పంచుకున్నాడు.

'మెగాస్టార్ తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం'

By

Published : Aug 21, 2019, 8:36 PM IST

Updated : Sep 27, 2019, 7:49 PM IST

65వ వసంతంలోకి అడుగుపెడుతున్న మెగాస్టార్​ చిరంజీవికి ఒకరోజు ముందుగానే విషెస్ చెప్పాడు ఆయన తమ్ముడు పవన్​ కల్యాణ్​. స్ఫూర్తి ప్రదాత చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్​లో సందేశాన్ని పంచుకున్నాడు.

"చిరంజీవి అంటే కేవలం మెగాస్టార్​ కాదు.. మూర్తీభవించిన స్ఫూర్తి. ఆయన తమ్ముడిని కావడం దేవుడిచ్చిన వరం. తన ప్రస్థానంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పట్టుదలతో వాటిని అధిగమిస్తూ ఉన్నత శిఖరాలకు చేరిన ధీరత్వం! వేసే ప్రతి అడుగు ఆదర్శం, అనుసరణీయం." -ట్విట్టర్​లో పవన్​ కల్యాణ్

పవన్​ కల్యాణ్ ట్విట్టర్​ పోస్ట్

'సైరా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు చిరంజీవి. బుధవారం వచ్చిన టీజర్​ అలరిస్తోంది. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది.

ఇది చదవండి: సల్మాన్​తో అదరగొట్టిన స్టార్​... ఇప్పుడు 'సైరా'తో....

Last Updated : Sep 27, 2019, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details