తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అన్నయ్య​ 'సైరా'కు తమ్ముడు జనసేనాని స్వరం

మెగాస్టార్ చిత్రంలో పవర్​స్టార్ స్వరం వినిపిస్తే... ఆ గొంతే చిత్ర కథలోకి మనల్ని నడిపిస్తే... ఇక అభిమానుల ఆనందానికి అవధులుండవు. త్వరలోనే వారికి ఆ సంతోషం కలగనుంది. సైరా చిత్రానికి పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ వాయిస్​ ఓవర్​ ఇచ్చాడు.

సైరా

By

Published : Aug 16, 2019, 10:13 AM IST

Updated : Sep 27, 2019, 4:10 AM IST

మెగాస్టార్​ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోకు విశేష స్పందన వస్తోంది. పవన్​కల్యాణ్​ ఈ సినిమాకు వాయిస్​ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. ఆగస్టు 20న టీజర్​ విడుదల కానున్న తరుణంలో రెండు రోజుల ముందే పవర్​స్టార్ గొంతు అరువిచ్చాడు.

తమ్ముడు వాయిస్​ ఓవర్​ ఇస్తున్నప్పుడు పక్కనే ఉన్న చిరంజీవి

తమ్ముడు తన చిత్రానికి భావోద్వేగంతో స్వరం వినిపిస్తుంటే చిరంజీవి పక్కనే ఉన్నారు. అన్నయ్య డైలాగ్​లు చెప్తుంటే ఆనందంతో అలాగే చూస్తుండిపోయాడు పవర్​స్టార్​. బ్రిటీష్ పాలకులను ఎదిరించి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి వెండి తెర రూపం ఈ చిత్రం.

అన్నయ్య డైలాగ్​కు ఆనందంలో తమ్ముడు

చిరంజీవి నటించిన శంకర్​ దాదా ఎమ్.బి.బి.ఎస్, శంకర్​దాదా జిందాబాద్ చిత్రాల్లో కాసేపు కనిపించాడు పవన్​కల్యాణ్. మళ్లీ ఈ సినిమాతోనే మెగాస్టార్ చిత్రంలో భాగమయ్యాడు పవర్​స్టార్​.

పవన్​కల్యాణ్​ వాయిస్​ ఓవర్​

కొణిదెల ప్రొడక్షన్స్​ బ్యానర్​పై రామ్​చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార కథానాయిక. విజయ్​సేతుపతి, సుదీప్​, జగపతిబాబు, తమన్నా కీలకపాత్రలు పోషించారు. అమితాబ్ బచ్చన్​ ప్రత్యేక పాత్రలో నటించాడు.

పవర్​స్టార్​ పవర్​ఫుల్​ డైలాగ్​
భావోద్వేగంతో వాయిస్​ ఇస్తున్న పవర్​స్టార్​

ఇది చదవండి: సైరా మేకింగ్​ వీడియో అదుర్స్​!

Last Updated : Sep 27, 2019, 4:10 AM IST

ABOUT THE AUTHOR

...view details