పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్‌సాబ్' క్లైమాక్స్ ఫైట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రతినాయకుడు దేవ్గిల్ను కొడుతున్నట్లు కనిపించిన పవన్.. సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు.
బాలీవుడ్ హిట్ 'పింక్'కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్ న్యాయవాదిగా నటించారు. ఇటీవల తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారు.