తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్ మరో సినిమా ప్రారంభం అప్పుడే..! - క్రిష్ పవన్ కల్యాణ్ షూటింగ్ ఎప్పుడంటే

పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'పింక్' రీమేక్ షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా సెట్స్​పై ఉండగానే మరో మూవీని మొదలుపెట్టబోతున్నాడట ఈ హీరో.

pawan
pawan

By

Published : Jan 21, 2020, 7:34 PM IST

Updated : Feb 17, 2020, 9:44 PM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తోన్న 'పింక్' తెలుగు రీమేక్ ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది. పవన్ నిన్నే సెట్లో అడుగుపెట్టాడు. అయితే పవర్​స్టార్ ఈ సినిమా హడావుడిలో ఉండగానే మరో మూవీని కూడా ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

'పింక్' రీమేక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో ఈ హీరో ఒక దొంగ పాత్రలో కనిపిస్తాడట. ఇక తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన అప్​డేట్ తెలిసింది. ఈ నెల 27 నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి.. హిందీలో రికార్డు సృష్టిస్తోన్న 'డియర్‌ కామ్రేడ్‌'

Last Updated : Feb 17, 2020, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details