పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ చంద్ర ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ 30 రోజుల కాల్షీట్స్ను కేటాయించి.. ఆ సమయంలోనే చిత్రాన్ని పూర్తి చేసే విధంగా చూడాలని చిత్రా నిర్మాణ సంస్థకు చెప్పారట.
రీమేక్ చిత్రం కోసం 30 రోజులు కేటాయించిన పవన్! - పవన్ కల్యాణ్ 30 రోజుల కాల్ షీట్స్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా కోసం పవన్ 30 రోజుల కాల్షీట్స్ను నిర్మాణ సంస్థకు కేటాయించినట్లు సమాచారం.
సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమయ్యే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాదు చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు తెలుగులో ఉన్న కొంతమంది యువకథానాయకులను పరిశీలిస్తున్నారట. మరీ పవన్ సరసన నటించే ఆ అవకాశం ఏ హీరోకి దక్కుతుందో చూడాలి.
ఈ చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ పనిచేస్తున్నారు. ఛాయాగ్రహకుడిగా ప్రసాద్ మూరెళ్ల వ్యవహరిస్తున్నారు. చిత్రం వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఈలోపు పవన్ పూర్తి చేయవలసిన చిత్రాలు ఉన్నాయి.