తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ దృష్టంతా 'వకీల్​సాబ్'​పైనే! - వకీల్​సాబ్ ఫస్ట్​లుక్

సినిమా షూటింగ్​లకు అనుమతులు ఇచ్చిన వెంటనే పవన్.. తన కొత్త ప్రాజెక్టులను వరుస షెడ్యూళ్లలో పూర్తి చేయనున్నారట. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

పవన్​ దృష్టంతా 'వకీల్​సాబ్'​పైనే!
పవన్​కల్యాణ్

By

Published : Jun 7, 2020, 5:26 AM IST

పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. వాటిలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న 'వకీల్‌సాబ్‌'.. క్రిష్, హరీశ్ శంకర్‌ల చిత్రాలు ఉన్నాయి. వీటిలో 'వకీల్​సాబ్' షూటింగ్​ తుది దశలో ఉండగా.. క్రిష్​తో చేస్తున్న ప్రాజెక్టు ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే చిత్రీకరణలకు అనుమతులిచ్చిన వెంటనే పవన్‌, తన దృష్టినంతా 'వకీల్‌సాబ్‌'పైనే పెట్టనున్నారట. ఇందుకు సంబంధించి ఆయన సన్నిహిత వర్గాల నుంచి ఓ ప్రకటన విడుదలైంది.

పవన్​కల్యాణ్ 'వకీల్​సాబ్' ఫస్ట్​లుక్

"చిత్రీకరణలు ప్రారంభమైన వెంటనే పవన్‌ 'వకీల్‌సాబ్‌'ను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత పూర్తిగా క్రిష్‌ చిత్రానికే సమయాన్ని కేటాయిస్తారు. వీటిని వరుస షెడ్యూళ్లలో పూర్తి చేయబోతున్నారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం వల్ల సినిమాలు విడుదలతో పాటు షూటింగ్​లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ఇటీవలే సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో పలు నిబంధనలతో చిత్రీకరణలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు దర్శక-నిర్మాతలు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details