తెలుగులో వచ్చిన 'అర్జున్‌రెడ్డి'ని.. 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి కెరీర్‌లోనే అతిపెద్ద విజయం ఖాతాలో వేసుకున్నాడు షాహిద్ కపూర్. ఇప్పుడీ ఉత్సాహంలోనే ఈ హీరో మరో తెలుగు రీమేక్‌కి పచ్చజెండా ఊపాడు. నాని కథానాయకుడిగా నటించిన 'జెర్సీ'ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నాడు షాహిద్. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వెర్షన్‌కూ దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో ప్రస్తుతం క్రికెట్ ఆటలో శిక్షణ తీసుకుంటున్నాడు షాహిద్.
హిందీ 'జెర్సీ'లో.. తండ్రీకొడుకులు - jersy
తెలుగులో నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నాడు. ఇందులో షాహిద్‌కు గురువుగా నటించనున్నాడు అతడి తండ్రి పంకజ్ కపూర్.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో షాహిద్‌కు క్రికెట్ గురువుగా అతడి తండ్రి పంకజ్ కపూర్‌నే తీసుకోబోతుంది చిత్రబృందం. పంకజ్ చేయబోయే పాత్రను తెలుగులో సత్యరాజ్ చేశాడు. షాహిద్ చివరిసారిగా తన తండ్రితో కలిసి నాలుగేళ్ల క్రితం 'షాందార్'లో నటించాడు. ఇందులో ఆలియా భట్‌కు తండ్రిగా పంకజ్ కనిపించాడు. మళ్లీ ఇన్నేళ్ల విరామం తర్వాత ఈ తండ్రీకొడుకులిద్దరూ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 28న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. 'అసురన్' దర్శకుడితో సూర్య..?