బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై.. నటి పాయల్ ఘోష్ మోపిన లైంగిక ఆరోపణలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే అతని తరఫున న్యాయవాది ప్రియాంక బిమాని ఓ ప్రకటన విడుదల చేశారు. నిరాధారమైన ఈ ఆరోపణల వల్ల తన క్లయింట్ అనురాగ్ మానసికంగా తీవ్ర బాధను అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. 'మీటూ' ఉద్యమాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని అన్నారు.
లైంగిక ఆరోపణలపై అనురాగ్ చట్టపరమైన చర్యలు!
ఇటీవలే బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలు చేసింది. అయితే, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అనురాగ్ తెలిపాడు.
అనురాగ్
అనురాగ్ తనను వేధింపులకు గురిచేశాడని ఆరోపించిన పాయల్.. సెప్టెంబరు 21(సోమవారం) ముంబయిలోని ఓషీవారా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. పాయల్ ఆరోపణలపై అనురాగ్‌కు మద్దతుగా నిలుస్తూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు.