'ఈగ', 'బాహుబలి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కన్నడ నటుడు సుదీప్. బాక్సింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న'పహిల్వాన్'లో హీరోగా నటిస్తున్నాడు. ఆ చిత్ర ట్రైలర్ ఐదు భాషల్లో గురువారం విడుదలైంది. ఇందులో కుస్తీ వీరుడు, బాక్సర్ పాత్రల్లో అభిమానుల్ని అలరించనున్నాడు సుదీప్.
బలం ఉందనే అహంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు అనే డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.