తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీలో ఈ రోజే ఇన్ని సినిమాలు రిలీజ్.. మీరేం చూస్తున్నారు? - OTT today releases

Ott release today movies: మీకోసం బోలెడన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్​లు ఓటీటీలో రెడీ అయిపోయాయి. శుక్రవారం రిలీజ్ అయ్యాయి. అందులో మరి మీరేం చూస్తారు లేదా ఇప్పటికే చూస్తున్నారా?

OTT today releases
ఓటీటీ మూవీ రిలీజ్ టుడే

By

Published : Dec 3, 2021, 11:15 AM IST

OTT release today in india: ఎప్పటిలానే ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు/వెబ్ సిరీస్​లు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చేశాయి. వాటిలో మనీహైస్ట్, ఇన్​సైడ్​ ఎడ్జ్ సిరీస్​లతో పాటు పలు భారీ సినిమాలూ ఉన్నాయి. ఇంతకీ అవేంటి వాటి సంగతేంటి చూసేద్దామా?

మనీహైస్ట్: ఐదో సీజన్​ వాల్యూమ్ 2

ఈ జాబితాలో మనం ముఖ్యంగా 'మనీహైస్ట్' గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే 2017 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ స్పానిష్​ వెబ్ సిరీస్​కు ఇదే చివరి సీజన్​. దీంతో ఏం జరగబోతుంది? ఫ్రొఫెసర్​ ఏం చేయనున్నాడు? అనే విషయాల కోసం సినీ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భారత్​లో శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది.

మనీహైస్డ్ లాస్ట్ సీజన్

ఇన్​సైడ్ ఎడ్జ్ 3-అమెజాన్ ప్రైమ్

ఫిక్సింగ్​, బెట్టింగ్, క్రికెటర్ల మధ్య వివాదాలు తదితర నేపథ్యంగా తీసిన 'ఇన్​సైడ్ ఎడ్జ్' వెబ్​ సిరీస్​ ఇప్పటికే రెండు సీజన్లు అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం మూడో సీజన్​ను రిలీజ్ చేశారు. ఈ సారి భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్​లు, అందులో భాగంగా ఏర్పడే వివాదాలను చూపించినట్లు ట్రైలర్​ను చూస్తే అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్​లో ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్​ అందుబాటులో ఉంది.

ఇన్​సైడ్ ఎడ్జ్ సీజన్ 3

సూర్యవంశీ-నెట్​ఫ్లిక్స్

అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' ఓటీటీలోకి అప్పుడే వచ్చేసింది. నెట్​ఫ్లిక్స్​లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్ దేవ్​గణ్, రణ్​వీర్ సింగ్​ కూడా ఉన్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్​. రోహిత్ శెట్టి దర్శకుడు.

అక్షయ్ కుమార్ సూర్యవంశీ మూవీ

మంచిరోజులు వచ్చాయి-ఆహా

యువహీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన 'మంచిరోజులు వచ్చాయి' సినిమా గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు 'ఆహా'లో విడుదలైంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్​టైనర్​ను మరి మీరు చూసేయండి.

మంచిరోజులు వచ్చాయి మూవీ

స్టార్ హీరో అభిషేక్​ బచ్చన్, సీరియల్ కిల్లర్​గా నటించిన 'బాబ్ బిశ్వాస్' నేరుగా జీ5లో విడుదలైంది. ఈ హిందీ సినిమాకు దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వం వహించారు.

అభిషేక్ బచ్చన్ 'బాబ్ బిశ్వాస్' మూవీ

యువ హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ తొలి సినిమా 'చిత్తిరాయ్ సెవ్వనమ్'. ఈ చిత్రాన్ని నేరుగా జీ5లో రిలీజ్ చేశారు. తెలుగు-తమిళంలో ఇది అందుబాటులో ఉంది. మరి సాయిపల్లవి సోదరి తన నటనతో మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ తొలి సినిమా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details