ప్రపంచ పట్టిపీడిస్తోన్న మహమ్మారి కరోనాపై హాలీవుడ్లో ఓ సినిమాను రూపొందించనున్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత, అమెరికన్ కథారచయిత చార్లెస్ రాండోల్ఫ్. ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాతగాను ఈయనే కావడం మరో విశేషం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నట్లు రాండోల్ఫ్ తెలిపారు. ఎస్కే గ్లోబల్ నిర్మాణ సంస్థ.. ఈ చిత్రనిర్మాణంలో భాగం కానుంది.