తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్ రూ.1.6 కోట్ల బ్యాగ్​లో బ్రా, గంజాయి చాక్లెట్లు

చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు 'ఆస్కార్​'. ఇందుకోసం ప్రతి ఏటా కొన్నివేల సినిమాలు పోటీపడుతుంటాయి. అయితే ఈ మెగా పురస్కారం సాధించిన విజేతలతో పాటు నామినేట్​ అయిన వారికీ ఓ గిఫ్ట్​బాక్స్​ ఇస్తారు. అందులో అత్యంత ఖరీదైన వస్తువులు ఉంచుతారు. అవేంటో తెలుసుకుందామా..

Oscar Awards: 9 expensive things inside the Rs 1.6 crore gift bag
ఆస్కార్​ బహుమతిలో ఏముంటాయో తెలుసా..!

By

Published : Feb 12, 2020, 3:37 PM IST

Updated : Mar 1, 2020, 2:27 AM IST

ఆస్కార్​ చిత్రోత్సవం అంటే అందరికీ అవార్డు మాత్రమే తెలుసు. ఇందులో విజేతలకు బంగారం పూత పూసిన ప్రతిమ ఇస్తారు. పురస్కారం దక్కించుకున్నవారికే కాకుండా నామినేట్​ అయిన వారికీ ఓ ప్రత్యేకమైన గిఫ్ట్​బాక్స్​ లభిస్తుంది. దాని విలువ దాదాపు కోటిన్నర రూపాయలు ఉంటుంది. మరి అంత విలువైన గిఫ్ట్​ బాక్స్​లో ఏముంటాయో తెలుసా.?

1)విలాసవంతమైన బస..

విజేతలకు లాస్ కాబోస్​లో విలాసవంతమైన అబెర్గ్​ రిసార్ట్​లో బసచేసే సదుపాయం కల్పిస్తారు. నామినీలకు మెక్సికోలోని విలాసవంతమైన రిసార్ట్‌లో రెండు రోజులు ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. అక్కడ సాధారణంగా ఒక రోజుకు 85 వేల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.

2) 12 రోజుల క్రూయిజ్ ప్రయాణం

ఆస్కార్ 2020 గిఫ్ట్​బాక్స్​లో అత్యంత ఖరీదైన పర్యటనకు టికెట్లు ఉంటాయి. అంటార్కిటిక్, మధ్యధరా మీదుగా 12 రోజులు క్రూయిజ్ నౌకలో ప్రయాణించొచ్చు. ఇందుకు 55 లక్షల రూపాయలను వెచ్చిస్తోంది ఆస్కార్​ అకాడమీ.

3) గ్యాంగ్​తో గడపడానికి..

స్పెయిన్​లోని ప్రముఖ లైట్​హౌస్​ ఫారో కంప్లిడాలో నామినీలు గడపడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం వారికి జతగా బృందాన్ని తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. ఇందులో నామినేట్​ అయిన వ్యక్తితో సహా 8 మంది అతిథులు బస చేసే అవకాశం కల్పిస్తారు.

స్పెయిన్​లోని లైట్ హౌస్​.. ఫారో కంప్లిడా

4) నటీమణులకు స్మార్ట్​ 'బ్రా'

ఆస్కార్‌కు నామినేట్​ అయిన నటీమణుల గిఫ్ట్​బాక్స్​లో స్మార్ట్ బ్రాను బహుకరిస్తారు. ఇది వక్షోజాల కొలతల గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఫలితంగాకచ్చితమైన లోదుస్తులు ఎంపిక చేసుకునేందుకు పనికొస్తుంది.

5) అంతా బంగారమే..

విజేతలకు బంగారు ఆస్కార్​ ప్రతిమతో పాటు.. బంగారపు పూతతో ఉన్న ఎలక్ట్రానిక్​ సిగరెట్​, సబ్బులు, లారియట్​ నెక్లెస్​ను బహుకరిస్తారు.

6) గంజాయి-ప్రేరేపిత చాక్లెట్లు

ఇటీవలే గంజాయిని చట్టబద్ధం చేయటం వల్ల గంజాయితో చేసిన చాక్లెట్లను ఇందులో జోడించారు.

గంజాయ్​ ప్రేరేపిత చాక్లెట్లు

7) ఫోర్టే విశ్లేషణ వ్యవస్థ

బ్యాగ్‌లోని అత్యంత విచిత్రమైన వస్తువు.. ఫోర్టే మెడికల్ మూత్ర సేకరణ పరికరం. ఇది యూరిన్​ను విశ్లేషించుకునేందుకు ఉపయోగపడుతుంది.

8) కార్డ్​ గేమ్​

ఆస్కార్ నామినీల బహుమతి బ్యాగ్‌లో 'కార్డు గేమ్' బాక్స్​లు ఉంటాయి. బ్యాగ్​లో ఖరీదైన ఐటమ్స్​ కాకుండా ఇలాంటి వింతైన వస్తువులనూ ఇందులో చేర్చారు.

కార్డ్​ గేమ్​

9) స్కై లైట్ ప్రొజెక్టర్..

స్కై లైట్ ప్రొజెక్టర్ ఇందులో ఉంచుతారు. ఇది గోడలపై నక్షత్ర కాంతులను కాంతులను విరజిమ్ముతుంది.

స్కై లైట్ ప్రొజెక్టర్ వెలుగులు

నామినీలు ఈ బహుమతులను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే అవకాశం ఉంది. గతంలో 'ది వైఫ్' కోసం నామినేటైన గ్లెన్ క్లోస్ మాత్రమే ఆమెకు బహుకరించిన వాటిని స్వచ్ఛంద సంస్థకు ఇచ్చింది.

ఆస్కార్ 2020 వేడుకలో ఎవ్వరూ విరాళాల రూపంలో వాటిని ఇవ్వలేదు. ఫోర్బ్స్​ ప్రకారం నామినీలు ఆ వస్తువులపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి.. ఆస్కార్‌ విజేతలు వీరే.. 'పారాసైట్'​కు అవార్డుల మోత

Last Updated : Mar 1, 2020, 2:27 AM IST

ABOUT THE AUTHOR

...view details