నిహారిక కొణిదెల.... మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరోయిన్. ఆమె నటించిన చిత్రం సూర్యకాంతం ఈ నెల 29న విడుదల కానుంది. రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రణీత్ బ్రహ్మండపల్లి దర్శకత్వం వహించాడు.
సూర్యకాంతంతో ఓ నిమిషం - FANS QUESTIONS
సూర్యకాంతం సినిమా ప్రచారంలో భాగంగా అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. అవేంటో మీరు వినేయండి.
అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన నిహారిక కొణిదెల
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు కేవలం 60 సెకన్లలో సమాధానాలు చెప్పింది నిహారిక.
నచ్చని హ్యాష్‌టాగ్, రెండు రోజుల పాటు స్నానం చేయకుండా ఉన్నారా, ఎలాంటి వ్యక్తితో డేట్‌కు వెళ్తారు, ఎలాంటి పాత్ర చేయాలనుకుంటున్నారు, ఈ సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం తదితర ప్రశ్నలకు నిహారిక సమాధానం చెప్పారు.