సినిమాల ప్రాబల్యం పెరిగాక నాటకాలు చూసే వారి సంఖ్య తగ్గింది. ఈ మాట మన దగ్గర ఎక్కువగా వినపడుతుంది. పాశ్చత్యదేశాల్లో మాత్రం ఇప్పటికీ థియేటర్ ఆర్ట్‌పై ఆదరణ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ రంగంలో రాణించిన వారికి ప్రతిష్టాత్మక 'లారెన్స్ ఒలివర్ అవార్డుల'ను అందజేశారు. ఇంగ్లండ్‌లోని లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ దీనికి వేదికైంది.
6 విభాగాల్లో ఈ అవార్డులను అందజేస్తారు. ఇందులో మళ్లీ ఒక్కో విభాగంలో వేరువేరు విభాగాల్లో పురస్కారాలు ఇస్తారు. డ్రామా, డ్యాన్స్, మ్యూజిక్, ప్రొడక్షన్, రిటైర్డ్, ప్రత్యేక విభాగాల్లో అవార్డులను అందజేస్తారు.
డ్రామా...
- బెస్ట్ న్యూ ప్లే..... ది ఇన్హెరిటెన్స్...... మాథ్యూ లోపేజ్
- బెస్ట్ రివైవల్...... సమ్మర్ అండ్ స్మోక్... ఆల్మిడా థియేటర్, డ్యూక్ ఆఫ్ యార్క్స్ థియేటర్
- బెస్ట్ న్యూ కామెడీ... హోమ్ ఐ యామ్ డార్లింగ్... లారా వేడ్
- బెస్ట్ యాక్టర్ (ఉత్తమ నటుడు)... ది ఇన్హెరిటెన్స్... కైల్ సోలర్
- బెస్ట్ యాక్ట్రెస్(ఉత్తమ నటి)... సమ్మర్ అండ్ స్మోక్..... ప్యాట్సీ ఫెరాన్
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్(ఉత్తమ సహనటుడు)... ది లెఫ్టినెంట్ ఆఫ్ ఇనీశ్మోర్... క్రిస్వ్యాలీ
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫీమేల్ (ఉత్తమ సహాయనటి)... ఇన్ ఆల్ అబౌట్... మోనికా డోలన్