బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ప్రముఖ నిర్మాత మహేశ్‌భట్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈమధ్య కాలంలో రియా చక్రవర్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు చర్చనీయాంశమవగా.. తాజా వీడియోలో దివంగత నటి జియాఖాన్‌తో సన్నిహితంగా ఉండటం కనిపించింది. అప్పుడు జియా వయసు 16 ఏళ్లుగా తెలుస్తోంది.
2004 సంవత్సరం నాటి ఆ వీడియోలో ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని.. నవ్వుతూ కనిపించారు. ఇండస్ట్రీలో మహేశ్ నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు కంగనా రనౌత్ సినిమా ఇండస్ట్రీలో మాఫియా గురించి మాట్లాడగా.. జియా తల్లి రబియా కూడా ఈ విషయంపై స్పందించారు.
జియా 2004లో విడుదలైన 'తుమ్సా నహీన్ దేఖా'లో ఇమ్రాన్ హస్మి సరసన నటించాల్సి ఉంది. దీనికి మహేశ్ సోదరుడు ముఖేశ్ భట్ నిర్మాత. అయితే, ఆ పాత్రకు తను న్యాయం చేయలేనని భావించి ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత 2007లో రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన 'నిశ్శబ్ద్' చిత్రంతో జియా ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
2013, జూన్ 3న జియా అనుమానస్పద స్థితిలో చనిపోయింది. ఈ విషయంలో నటుడు సూరజ్ పంచోలిపై కేసు నమోదైంది. ముంబయి పోలీసులు జియా మృతిని ఆత్మహత్యగా పేర్కొంటూ.. కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని జియా తల్లి రబియా ఖాన్ పేర్కొంది. ఇప్పుడు సుశాంత్ కేసులోనూ అదే జరుగుతోందని ఆమె ఆరోపించారు.