ఇటీవల వచ్చిన 'ఓ బేబీ' టీజర్.. అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది. సమంత ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రీమేక్‌లో ఓ అగ్రకథానాయిక నటించనుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఓ వృద్ధురాలి ఆత్మ 20 ఏళ్ల యువతి శరీరంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అనే విభిన్న కథాంశంతో తెరకెక్కిందీ సినిమా. రావు రమేశ్, లక్ష్మి, నాగశౌర్య ఇతర పాత్రలు పోషించారు. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు.