తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మేకింగ్​లోనూ 'బేబీ' సందడే సందడి - రావు రమేశ్

సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' చిత్రం మేకింగ్ వీడియో విడుదలైంది. ప్రస్తుతం థియేటర్లలో హిట్​ టాక్​తో దూసుకుపోతోందీ సినిమా.

మేకింగ్​లోనూ 'బేబీ' సందడే సందడి

By

Published : Jul 17, 2019, 5:46 PM IST

సమంత అద్భుత నటనతో అలరించిన చిత్రం 'ఓ బేబీ'. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి రూ.35 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

సినిమా మేకింగ్​ వీడియోను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. బేబీగా సందడి చేసింది అక్కినేని హీరోయిన్.

70 ఏళ్ల వృద్ధురాలు.. 24 సంవత్సరాల యువతిగా మారితే ఎలా ఉంటుంది అనే వినూత్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. నటనతో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది సమంత. రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, లక్ష్మి ఇతర పాత్రల్లో నటించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించింది.

తెలుగులో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని హిందీలోనూ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్​ శ్రద్ధా కపూర్.. 'బేబీ'గా నటించనుందని సమాచారం.

ఇది చదవండి: వెబ్​ సిరీస్​, ఫ్రెంచ్​ కామెడీ రీమేక్​లో సమంత..!

ABOUT THE AUTHOR

...view details