ప్రముఖ యాంకర్, నటి అనసూయ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'కథనం'. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాలోని మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం.
'చీకటి కొండల్లోన.. తూరుపు నువ్వేనమ్మా' - kathanam
యాంకర్ అనసూయ ప్రధానపాత్రలో నటించిన 'కథనం' సినిమాలోని మొదటి పాట విడుదలైంది. ఓ అమ్మా అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది.
అనసూయ
"చీకటి కొండల్లోన.. తూరుపు నువ్వేనమ్మా.. గుడిసె గుండెల్లోనా.. మెరుపు నువ్వేనమ్మా.. పిలవగానే పలుకుతావే మాకోసమొచ్చిన దేవత" అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాలభైరవ గాత్రం వినసొంపుగా ఉంది. రోషన్ సాలూరు ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఇవీ చూడండి.. 'బామ్మ పాత్ర చేయడానికి నేను సిద్ధం!'