తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఛాలెంజ్​లో పాల్గొని ట్రోలింగ్​కు గురైన నటి - సినిమా వార్తలు

సేఫ్​హ్యాండ్స్ ఛాలెంజ్​​లో పాల్గొన్న నటి నూస్రత్​కు నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదురైంది. కుళాయి నీటిని వృథాగా విడిచిపెట్టడమే ఇందుకు కారణం.

ఛాలెంజ్​లో పాల్గొని ట్రోలింగ్​కు గురైన నటి
నటి నూస్రత్ జహన్

By

Published : Mar 20, 2020, 10:29 PM IST

బెంగాలీ నటి, ఎంపీ నూస్రత్ జహన్.. #సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్​లో పాల్గొంది. కరోనా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవాలని ప్రజలకు సూచించింది. అయితే ఈ జాగ్రత్తలు చెబుతున్నంతసేపు ట్యాప్ వదిలేయడం వల్ల నీరు వృథాగా పోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు.. ఆమెను ట్రోల్ చేశారు.

శానిటైజేషన్ ముఖ్యం కానీ నీటిని పొదుపు చేయడం అంతకంటే ముఖ్యమని నూస్రత్​ వీడియోకు కామెంట్​ పెట్టాడో నెటిజన్. చేతులు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడం మంచిదే. అదే సమయంలో కుళాయిని వదిలేయడం బాధ కలిగించింది. వీడియోలతో ఫేమ్ తెచ్చుకునేందుకు ఇలా చేయడం సరికాదు అని మరో నెటిజన్​ కామెంట్ చేశాడు.

నూస్రత్ వీడియో నెటిజన్ కామెంట్​
నూస్రత్ వీడియో నెటిజన్ కామెంట్​
నూస్రత్ వీడియో నెటిజన్ కామెంట్​
నూస్రత్ వీడియో నెటిజన్ కామెంట్​

ABOUT THE AUTHOR

...view details