తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిర్మాతగా మారబోతున్న యంగ్ టైగర్..! - జూనియర్ ఎన్టీర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నాడని సమాచారం. ఇకపై తన సినిమాల నిర్మాణంతో పాటు, చిన్న చిత్రాలను రూపొందించే ఆలోచనలో ఉన్నాడట.

ఎన్టీఆర్

By

Published : Nov 9, 2019, 2:09 PM IST

అగ్ర క‌థానాయ‌కులు నిర్మాత‌లుగా మారుతుండటం చూస్తూనే ఉన్నాం. మ‌హేశ్ బాబు ఇప్ప‌టికే సొంత సంస్థ స్థాపించి, చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామ్యం తీసుకుంటున్నాడు. ప్ర‌భాస్ చేతిలో యూవీ క్రియేష‌న్స్ ఉంది. నాని, విజ‌య దేవ‌ర‌కొండ లాంటి యువ క‌థానాయ‌కులు కూడా నిర్మాత‌లైపోయారు. ఇప్పుడు ఈ జాబితాలో ఎన్టీఆర్ చేర‌బోతున్న‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ ఓ సొంత నిర్మాణ సంస్థ‌ను స్థాపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హేశ్​ బాబులానే, ఇక మీద‌ట త‌న సినిమాల‌ నిర్మాణంలో పాలు పంచుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. ఓ మంచి రోజు చూసుకుని నిర్మాణ సంస్థ‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలున్నాయి. నానిలా చిన్న సినిమాల్నీ రూపొందించే ఆలోచ‌న ఉందట. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

డబ్బింగ్ షురూ చేసిన మెగా మేనల్లుడు

ABOUT THE AUTHOR

...view details