తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హరికృష్ణ జయంతి.. తారక్, బాలయ్య భావోద్వేగ పోస్ట్ - కల్యాణ్ రామ్ ట్విట్టర్ పోస్ట్

నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు నందమూరి హరికృష్ణ. నేడు ఆయన జయంతి(Nandamuri Harikrishna Birthday) సందర్భంగా.. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగ పోస్టులు పెట్టారు.

nandamuri harikrishna
నందమూరి హరికృష్ణ

By

Published : Sep 2, 2021, 10:23 AM IST

నేడు(సెప్టెంబర్ 2) నటుడు హరికృష్ణ 65వ జయంతి(Nandamuri Harikrishna Birthday). ఈ సందర్భంగా.. పలువురు నటులు, అభిమానులు ఆయనను గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమారులు ప్రముఖ హీరోలు తారక్(Junior NTR), కల్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) కూడా సంతాపం తెలిపారు. సోషల్​ మీడియా వేదికగా తమ తండ్రిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. నందమూరి బాలకృష్ణ తన అన్నను గుర్తుచేసుకుంటూ ఫేస్​బుక్​లో ఓ పోస్ట్ చేశారు.

"మీ 65వ జయంతి రోజున మిమ్మల్ని స్మరించుకుంటూ.. మిస్​ యూ నాన్న"

--జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ట్వీట్స్.

"హరన్న అంటే ధైర్యం, హరన్న అంటే ఆత్మవిశ్వాసం, హరన్న అంటే మొండితనం, హరన్న అంటే తెలుగుతనం. మా అన్న హరన్న జయంతి నేడు. ఈరోజు ఆయన మా మధ్య లేకపోయినా మా మనసుల్లో ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. మా హరన్న ఎక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.."

-నందమూరి బాలకృష్ణ, నటుడు.

బాలకృష్ణ పోస్ట్

ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'బింబిసార' సినిమా చేస్తున్నారు కల్యాణ్ రామ్. ఇక బాలయ్య 'అఖండ'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చదవండి:'లావుగా ఉన్నప్పుడు రాజమౌళి అలా అన్నారు'

ABOUT THE AUTHOR

...view details