తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్రివిక్రమ్​తో ఎన్టీఆర్.. అభిమానుల్లో అంచనాలు..? - తెలుగు ఎన్​టీఆర్​ కొత్త సినిమా

'ఆర్​ ఆర్​ ఆర్'​ తర్వాత ఎన్టీఆర్​ మరో చిత్రం త్రివిక్రమ్​తో కలిసి చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్య సినిమా గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

ntr, trivikram combination movie may be come soon

By

Published : Nov 17, 2019, 2:40 PM IST

తెలుగు చిత్ర కథానాయకులు సినిమాల విషయంలో వేగం పెంచారు. ముందులా సినిమా పూర్తయ్యాకే కొత్త చిత్రం గురించి ఆలోచించడం లేదు. ఒక సినిమా సెట్స్​పై ఉండగానే, మరో చిత్రానికి పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్​ కూడా అదే జోరుతో ఉన్నాడు. 'ఆర్ ఆర్ ​ఆర్' తర్వాత విరామం తీసుకోకుండా వెంటనే మరో సినిమాకు పచ్చజెండా ఊపేస్తున్నాడట. ఆయన తదుపరి చిత్రం త్రివక్రమ్​ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం.

వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరో సినిమా గురించి ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ ‘'అల వైకుంఠపురములో' సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి ఆ చిత్రం తర్వాత ఆయన మరో మూవీ చేస్తారా.. లేక నేరుగా ఎన్టీఆర్‌తోనే సినిమాని పట్టాలెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: వాట్సాప్​లో కొత్త ఫీచర్ల సందడి.. అవేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details