NTR On Ajay Devgan: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం డిసెంబర్ 9న ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకధీరుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవ్‌గణ్.. పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది? అన్న ప్రశ్నకు ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అజయ్ దేవ్‌గణ్ చిత్రాలు చూస్తూ పెరిగానని, ఆయన నాకు గురువు లాంటి వారని అన్నారు. అజయ్‌కు ఉన్న సినియారిటీ దృష్ట్యా.. తనతో పోల్చవద్దన్నారు. 'ఫూల్ ఆర్ కాంటే' చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ ఎంట్రీ చూసి చిన్నతనంలో ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఇప్పటికీ షాక్ గానే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ సమాధానానికి.. నన్ను పెద్దవాడిని చేసినందుకు ధన్యవాదాలు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు అజయ్ దేవగణ్. గురువారం ఉదయం 10 గంటలకు థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.