తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టిక్​టాక్​లో 'జూనియర్ ఎన్టీఆర్' సందడి - పంజాబ్ షమీందర్ సింగ్

వీడియో యాప్ టిక్​టాక్​​లో జూ.ఎన్టీఆర్​ను పోలిన వ్యక్తి సందడి చేస్తున్నాడు. అతడి వీడియోలు వైరల్ అవుతున్నాయి.

టిక్​టాక్​లో 'జూ.ఎన్టీఆర్' సందడి

By

Published : May 13, 2019, 3:24 PM IST

టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ టిక్ టాక్ వీడియో చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. తమ అభిమాన కథానాయకుడు టిక్ టాక్​లో ఉన్నాడేంటి అని అభిమానులు అశ్చర్యపోయారు. అందులో ఉన్నది ఎన్టీఆర్ కాదు.. అతడ్ని పోలిన మరో వ్యక్తి అని తెలిసి తర్వాత షాకయ్యారు.

ఇతని పేరు షమీందర్‌ సింగ్‌. స్వస్థలం పంజాబ్‌. ఏరోనాటికల్‌ ఇంజినీర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను తారక్‌కు వీరాభిమాని. చూడటానికి అచ్చం ఎన్టీఆర్​లా ఉండటం మరో విశేషం. సోషల్‌ మీడియాలో అతడి ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్​లానే ఉన్న షమీందర్ సింగ్

‘నా పేరు షమీందర్‌ సింగ్‌. నాకు ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం. మాది పంజాబ్‌. నాకు తెలుగు రాదు. కానీ, తారక్‌ను కలవాలని చాలా ప్రయత్నిస్తున్నాను. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నన్ను చూసి సోషల్‌ మీడియాలో తెగ మెసేజ్‌లు చేస్తున్నారు’ -షమీందర్ సింగ్

ఎన్టీఆర్‌ సన్నిహితుడు, నిర్మాత మహేశ్‌ కోనేరును ట్యాగ్‌ చేస్తూ షమీందర్‌ పలు ట్వీట్స్‌ చేశాడు. తారక్‌ నటించిన ఎన్నో సినిమాల్లోని డైలాగ్‌లను అనుకరిస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఇతడ్ని కలిస్తే ఎలా ఫీలవుతాడో చూడాలి మరి..!

ABOUT THE AUTHOR

...view details