ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్‌తో తీసే మూవీలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్టులు అయిపోయిన వెంటనే ఇద్దరూ కలిసి మరోసారి కలిసి పనిచేయనున్నారని చెప్పుకుంటున్నారు.
ఇంతకుముందు ఎన్టీఆర్.. కొరటాల దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమాలో నటించాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ సమయంలోనే మరో చిత్రం చేస్తానని ఎన్టీఆర్ కొరటాలకు మాట ఇచ్చారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.